ఆధార్ కార్డు కి NPCI Mapping ఎందుకు అవసరం? Npci Mapingఅంటే ఏమిటి
●Npci Maping అనేది మీ బ్యాంక్ అకౌంట్ కి చేస్తారు ,మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకు కి వెళితే Npci Maping చెయ్యమంటే చేస్తారు, నీ బ్యాంక్ అకౌంట్ కి NpCI Mapping రెండు రోజులలో యాక్టివేట్ అవుతుంది ,మీ బ్యాంకు కు Npci Mapping చేయించడం వల్ల గవర్నమెంటు నుంచి వచ్చే బెనిఫిట్స్, payment డైరెక్ట్ గా మీ అకౌంట్లో పడతాయి
● Npci Mapping అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది బ్యాంకు ఎకౌంటు కి లింక్ అయితేనే ఇండియన్ గవర్నమెంట్ or స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ లేదా పేమెంటు మీ అకౌంట్ లో పడతాయి, ఇది లింకు కాకపోవడం వల్లే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలకు సంబంధించిన పేమెంటు నీ అకౌంట్లో పడవు
● మీ ఆధార్ కార్డు తోNpci మ్యాపింగ్ అయిందా లేదా చూసుకోవచ్చు , అలా చూసుకోవాలి అంటే మీ ఆధార్ కార్డు కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి
బ్యాంకుకు NPCI mapping అయిందా లేదా ఇలా తెలుసుకోండి?
1) మొదటగా మీరు మీ మొబైల్ ఫోన్ లో ఈ క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి ,
వెంటనే మీకు Uidal కు సంబంధించిన Main వెబ్ సైట్ open అవుతుంది
2) ఆ తర్వాత Left hand Side లో పైన ఉన్న 3 Lines నీ క్లిక్ చేయాలి,
వెంటనే My Aadhaar ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన వెంటనే మీకు
●Get Aadhaar
●Update your Aadhaar
●Aadhar services
●About your Aadhaar
●Aadhar on your Mobile
●Downloads
ఇలా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి , అందులో Aadhaar service ఆప్షన్ మీద క్లిక్ చేయాలి
3) Aadhar Services కి సంబంధించి Main website ఓపెన్ అవుతుంది, అందులో మీరు చూసినట్లయితే
Aadhar Linking Status అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి
4) ఆధార్ లింక్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అందులో మీరు చూసినట్లయితే
●Aadhaar numbers:- ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి
● security code:- క్రింద ఉన్న code ని పైన ఎంటర్ చేయాలి, తరువాత Send OTP మీద క్లిక్ చేసినట్లయితే
ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది దానిని తర్వాత బాక్సులో OTP ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి
5) చివరగా మీకు check aadhaar Bank Linking Status అనే మెయిన్ పేజీ ఓపెన్ అవుతుంది, అందులో మీకు
Congratulations your Aadhar Bank Mapping has been done అని వస్తుంది నీ బ్యాంకు కి npci Mapping లింక్ అయింది అని అర్థం, క్రింద చూసినట్లయితే మీకు
Aadhar number:- ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఉంటుంది
Bank Linking Status:- బ్యాంకు లింక్ స్టేటస్ యాక్టివ్ గా ఉందా లేదా ఇన్ ఆక్టివ్ గా ఉందా చూపిస్తుంది.
Bank Linking Date:- నీ బ్యాంకు కి ఎప్పుడు మ్యాపింగ్ అయిందో ఆ డేట్ కూడా చూపిస్తుంది
Bank:- Npci మ్యాపింగ్ లింక్ అయినా బ్యాంకు పెరు చూపిస్తుంది
ఈ విధంగా మీరు మీ బ్యాంకు కి NpCi మ్యాపింగ్ అయిందా లేదా చూసుకోవచ్చు.
0 కామెంట్లు