మీ భూమి కి mobile number లింక్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు మీ మొబైల్ ఫోన్ లోనే మీ భూమి కి mobile number లింక్ అయ్యిందా లేదా తెలుసుకోవచ్చు అలా తెలుసుకోవాలి అంటే ఈ క్రింద చూపిన విధంగా మీరు ఫాలో అవ్వండి.
మీ పొలం పాస్ బుక్ కి మొబైల్ నెంబర్ లింక్ అయిందా లేదా ఇలా తెలుసుకోండి:-
ఆధార్ కార్డు కి లింక్ అయిన మొబైల్ నెంబరు మీ పొలం పాస్ బుక్ కి కూడా లింక్ కావాలి, మీ పాస్ బుక్ కి మొబైల్ నెంబర్ లింక్ చేయడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే అమౌంట్ ,బ్యాంకు కి లింక్ అయినా ఫోన్ నెంబర్ కి అమౌంట్ వస్తుంది, ఫోన్ నెంబర్ లింకు కాకపోతే గవర్నమెంట్ స్కీమ్స్ కి మీరు అర్హులు కాదు,
మీ భూమి వెబ్సైట్ లో మొబైల్ నెంబర్ లింక్ అయిందో లేదో ఇలా చెక్ చేయండి:-
మీ పాస్ బుక్ కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా తెలుసుకోవాలి అంటే మీ మొబైల్లోనే తెలుసుకోవచ్చు మీరు ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు
1) మొదట మీ మొబైల్ లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో ఈ కింద ఇచ్చిన లింకు search చేయండి.
2)meeboom Web site ఓపెన్ అయిన వెంటనే అందులో ఆధార్ ఇతర గుర్తింపు పత్రాలు ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మొబైల్ నెంబర్ లింకింగ్ గుర్తింపు పత్రములు ఆధారంగా ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
3) ఆధార్ లేనిచో ఇతర గుర్తింపు పత్రాలు అప్లోడ్ అనే మరొక పేజీ వస్తుంది అందులో మీరు చూసినట్లయితే
● జిల్లా పేరు ● మండలం పేరు ● గ్రామం పేరు ● ఖాతా నెంబర్ ఇలా మీకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఆ తరువాత పైన ఉన్న code ని కింద ఉన్న బాక్స్ లో ఎంటర్ చేయాలి, ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న బాక్స్ లో రైట్ మార్క్ ఇవ్వాలి,Get details మీద క్లిక్ చేయాలి
4) నీ మొబైల్ నెంబర్ కి సంబంధించిన మరొక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది, అందులో మీరు చూసినట్లయితే
● ఖాతా సంఖ్య ● పట్టాదారుని పేరు ● తండ్రి పేరు ● ఆధార్ లింకింగ్ స్థితి ● ఆధార్ మొబైల్ నెంబర్
ఆధార్ మొబైల్ నెంబర్ చూసినట్లయితే మీ పాస్ బుక్ కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా తెలుస్తుంది, ఒకవేళ మీకు ఏం మొబైల్ నెంబర్ లింక్ అయిందో మీకు గాని తెలియకపోతే క్రింద కనిపిస్తున్న,
వి.ఆర్.ఓ చే ఆమోదించబడిన మొబైల్ నెంబరు కాడ ని పాస్ బుక్ కి లింక్ అయినా మొబైల్ నెంబర్ ఉంటుంది, అదే మీ పాస్ బుక్ కి లింక్ అయినా నంబరు. ఈ విధంగామీ పాస్ బుక్ కి మొబైల్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుసుకోవచ్చు.
0 కామెంట్లు