● మీ ఆధార్ కార్డు కి ఏ బ్యాంకు లింక్ అయ్యి ఉంటుందో ఆ బ్యాంకు కు మాత్రమే గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ పేమెంట్ ఆ అకౌంట్ లో పడతాయి, దీనివలన పీఎం కిసాన్ లేదా రైతు భరోసా డబ్బులు ఏ బ్యాంకులో పడుతున్నా యి తెలుసుకోవచ్చు
ఆధార్ కార్డు కి ఏ బ్యాంకు లింకు చేశారు ఇలా తెలుసుకోండి:-
1) మొదటగా మీరు మీ మొబైల్ ఫోన్ లో ఈ క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి ,వెంటనే మీకు Uidal కు సంబంధించిన Main వెబ్ సైట్ open అవుతుంది
Link 1:-https://uidai.gov.in/
2) ఆ తర్వాత Left hand Side లో పైన ఉన్న 3 Lines నీ క్లిక్ చేయాలి,
వెంటనే My Aadhaar ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన వెంటనే మీకు
●Get Aadhaar
●Update your Aadhaar
●Aadhar services
●About your Aadhaar
●Aadhar on your Mobile
●Downloads
ఇలా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి , అందులో Aadhaar service ఆప్షన్ మీద క్లిక్ చేయాలి
3) Aadhar Services కి సంబంధించి పేజీ ఓపెన్ అవుతుంది, అందులో మీరు చూసినట్లయితే
Check Aadhar/ Bank Linking Status అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి
4) వెంటనే check Aadhar/Bank Linking Status అనే పేజీ ఓపెన్ అవుతుంది
●Aadhaar numbers:- ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి
● security code:- క్రింద ఉన్న code ని పైన ఎంటర్ చేయాలి, తరువాత Send OTP మీద క్లిక్ చేసినట్లయితే
ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది దానిని తర్వాత బాక్సులో OTP ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి
5) చివరగా మీకు check aadhaar/ Bank Linking Status అనే పేజీ ఓపెన్ అవుతుంది, అందులో మీకు
Congratulations your Aadhar Bank Mapping has been done అని వస్తుంది, క్రింద చూసినట్లయితే
Aadhar number:- ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఉంటుంది
Bank Linking Status:- బ్యాంకు లింక్ స్టేటస్ యాక్టివ్ గా ఉందా లేదా ఇన్ ఆక్టివ్ గా ఉందా చూపిస్తుంది
Bank Linking Date:- నీ బ్యాంకు కి ఎప్పుడు మ్యాపింగ్ అయిందో ఆ డేట్ కూడా చూపిస్తుంది
Bank Name:- ఆధార్ కార్డు కి లింక్ అయినా బ్యాంకు పెరు చూపిస్తుంది
ఈ విధంగా మీరు మీ ఆధార్ కార్డు లింక్ అయినా బ్యాంకు పేరు చెక్ చేసుకోవచ్చు
0 కామెంట్‌లు