Meeboomi వెబ్ సైట్ వల్ల ఉపయోగాలు:-
మీ భూమి వెబ్సైట్ ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము 2015 జూన్లో ప్రారంభించడం జరిగింది, ప్రజలు వాళ్ళకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని వాళ్ల మొబైల్ ఫోన్ లోనే చూడవచ్చు భూమికి సంబంధించిన సమాచారం మొత్తం మీ భూమి పోర్టల్ ద్వారా పొందవచ్చు, వాళ్ల భూమి సంబంధించిన పొలం మీ పేరుమీద ఉందా లేదా మరిన్ని విషయాలు మీ భూమి వెబ్ సైట్ లో చూడవచ్చు
మీ భూమి అడంగల్ వల్ల ఉపయోగాలు :-
మీ గ్రామానికి సంబంధించిన అందరి లిస్టు ఇందులో చూడవచ్చు, మీది ప్రభుత్వ భూమి లేదా వారసత్వం భూమి అని తెలుసుకోవచ్చు అలానే, నీ భూమి చుట్టూ కాలిబాట ఉందా లేకపోతే కాలువ ఉందా తెలుసుకోవచ్చు, భూమి విస్తీర్ణం ఎంత అలానే మీ భూమి యజమాని పేరు, సర్వే నెంబరు ఖాతా నెంబరు, ఇలా మరెన్నో విషయాలు అడంగల్ ని డౌన్లోడ్ చేయడం వల్ల తెలుస్తుంది
అడంగల్ మీ మొబైల్ లోనే డౌన్లోడ్ చేయవచ్చు దీనికోసం ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు.
మీ భూమి యొక్క అడంగల్ ని ఇలా తీసుకోండి:-
1) మొదట గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో ఈ క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి వెంటనే మీకు మీ భూమి సంబంధించిన మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది,
2} మీ భూమి వెబ్సైట్ లో అడంగల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసిన వెంటనే నీకు రెండు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి.
●మీ అడంగల్ ●గ్రామ అడంగల్
మీ గ్రామానికి సంబంధించిన Total లిస్టు చూడాలి అంటే గ్రామ అడంగల్ క్లిక్ చేయాలి లేదా మీ అడంగల్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఓన్లీ నీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడొచ్చు, మీ ఊరు లిస్టు చూడాలి అనుకుంటే గ్రామ అడంగల్ క్లిక్ చేయాలి
3) గ్రామ అడంగల్ కి సంబంధించిన మరొక పేజీ ఓపెన్ అవుతుంది అందులో మీరు చూసినట్లయితే
◆ జిల్లా పేరు◆ మండలం పేరు ◆ గ్రామం పేరు ఎంటర్ చేసి, పైన కోడి ని కింద బాక్స్ లో ఎంటర్ చేయాలి
చివరగా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి
అందులో మీరు పరిశీలించినట్లయితే నీపొలాన్ని కి చుట్టూ కాలువలు ఉన్నాయా లేవా అలానే నీది సొంత పొలం లేదా గవర్నమెంట్ పొలమ్మ,, భూ యజమాని పేరు అలానే భూమి విస్తరణ అలానే మీ ఊరిలో ఎవరికి ఎంత భూమి ఉంది వాళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం ఈ లిస్టులో మీరు చూడవచ్చు ఇలా మరెన్నో విషయాలు మీ గ్రామ అడంగల్ లో లభిస్తాయి.
0 కామెంట్లు