ప్రజలు వాళ్ల భూమికి సంబంధించిన1B, అడంగల్, విలేజ్ మ్యాప్, మొబైల్ నెంబర్ లింక్ ,ఆధార్ కార్డు లింక్, ఇలా మరెన్నో విషయాలు ఇంట్లో నుంచే తెలుసుకోవచ్చని మీభూమి సైట్ ని ప్రారంభించడం జరిగింది
నీ భూమికి 1-B కాఫీ దేనికి అవసరం:-
మీ భూమి కి 1- బి కాపీ ఉండడం వలన, ఆ భూమి మీ పేరుమీద ఉందా లేదా తెలుసుకోవచ్చు ,అలానే మీ భూమి ఎంత విస్తీర్ణంలో ఉందో తెలుసుకోవచ్చు, నీ భూమి యొక్క ఖాతా నెంబర్, సర్వేనెంబర్ కూడా తెలుసుకోవచ్చు , వారసత్వంగా వచ్చిన భూమి లేదా కొనుగోలు చేసిన భూమి అని కూడా తెలుసుకోవచ్చు, ఒకవేళ భూమి గాని కొనుగోలు చేసినట్లు అయితే ఎప్పుడు కొనుగోలు చేశారు year తో సహా కూడా తెలుసుకోవచ్చు , ఈ భూమికి సంబంధించి ఎటువంటి కోర్టు తగాదాలు ఉన్న 1-B కాపీ కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ,
ఇలా మరెన్నో వాటికి 1-B అవసరం ,మీ భూమి కి యొక్క 1B లిస్టు ని మీ మొబైల్ ఫోన్ లో ఫ్రీగా డౌన్లోడ్ చేయండి ఈ క్రింద చూపిన విధంగా మీరు ఫాలో అవ్వండి
మీ భూమి 1B లిస్టు ని ఇలా డౌన్లోడ్ చేయండి:
1) మొదటి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో మీ భూమి వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి లేదా ఈ క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి
2) మీ భూమి వెబ్ సైట్ ఓపెన్ అయిన వెంటనే అందులో మీరు చూసినట్లయితే,
1-బి అనే ఆప్షన్ ఉంటుంది దానిమీద క్లిక్ చేసినట్లయితే, మీకు రెండు రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి
● మీ1-బి ● గ్రామ 1-బి
అందులో మీ 1-బి మీద క్లిక్ చేయండి
3)1-బి నమూనా అనే మరొక పేజీ ఓపెన్ అవుతుంది, అందులో మీకు చాలా రకాల ఆప్షన్లు కనిపిస్తాయి
● సర్వే నంబరు ● ఖాతా నెంబరు ● ఆధార్ నెంబర్ ● పట్టాదారుని పేరు ● ఆటో మ్యుటేషన్ రికార్డులు
పైన చెప్పిన వాటిలో కావలసిన దాని మీద సెలెక్ట్ చేసుకోవాలి ఆ తరువాత
◆ జిల్లా పేరు ◆ మండలం పేరు ◆ గ్రామం పేరు◆ మీరు సెలెక్ట్ చేసుకొన్న నెంబర్ ని ఎంటర్ చేయాలి
అలా అన్నీ ఫిల్ చేసి, పైన ఉన్న కోడ్ ని ఎంటర్ చేయాలి కింద ఉన్న బాక్స్ లో ఆ తరువాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి.
4) తరువాత మరొక పేజీలో భూమి యజమానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి, అందులో మీరు చూసినట్లయితే
◆పట్టాదారుని పేరు ◆ఖాతా నెంబర్ ◆సర్వే నెంబరు ◆ భూమి విస్తరణ, ఇలా మరెన్నో మీకు సంబంధించిన డీటెయిల్ 1-B కాఫీ లో చూడవచ్చు
0 కామెంట్లు