E-SHRAM card registration 2021 online

ESHRAM పధకాన్ని ప్రవేశ పెట్టడానికి ముఖ్య కారణాలు:-

                                   కేంద్ర  & రాష్ట్ర మంత్రిత్వశాఖ లచే అమలు చేయబడిన సామాజిక భద్రత మరియు ఆర్థిక సహాయ0  ప్రయోజనాలు అందించడానికి ఉపయోగపడుతుంది . ESHRAM వెబ్సైట్లో  రిజిస్ట్రేషన్ ఉచితం కార్మికులు ఏ రిజిస్టర్ చేసే సంస్థకు ఎటువంటి చార్జీలు చెల్లించ వలసిన అవసరం లేదు, కేంద్ర /రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక భద్రత ప్రయోజనాల ద్వారా లేదా ఏదైనా ఆర్థిక సహాయాన్ని అందించవలసి వస్తే స్వయంగా గా కార్మికుని బ్యాంక్ అకౌంట్ లో పడే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేయబడింది, ప్రభుత్వం ESHRAM పథకాన్ని ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం  ఈ పథకాన్ని ఆధార్ కార్డుతో Link చేయబడి ఉంటుంది , ఈ ESHRAM పథకంలో Registration చేసుకున్న ప్రతి ఒక వ్యక్తికి PMSBY పథకం కింద ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం కలిగిన వారికి 2 లక్షల ప్రమాద బీమా కవరేజ్ పొందుతారు అంతే కాకుండా పాక్షిక వైకల్యం ఉన్నవారికి 1లక్ష భీమా ని పొందుతారు ,వలస మరియు నిర్మాణ కార్మికులకు వారి పని ప్రదేశాలలో సామాజిక భద్రత మరియు సంక్షేమం ప్రయోజనాలు భవిష్యత్తులో ఈ పథకం కింద అందజేయబడతాయి, అత్యవసర మరియు జాతీయ మహమ్మారి వంటి పరిస్థితుల్లో అర్హులైన కార్మికులకు అవసరమైన ఆర్థిక సహాయాన్నిఅందించడానికి భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది.

Eshram card apply online
Eshram card apply online


 Click here:- E-shram                 Link:- https://register.eshram.gov.in/#/user/self








ESHRAM పథకానికి అర్హులైన వారు లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వారు:-

●16-59 సంవత్సరాల మధ్య వయసున్న ఏ కార్మికులు అయినా ESHRAM వెబ్ సైట్ లో అప్లై చేసుకోవడానికి అర్హులు

● చిన్న  మరియు సన్నకారు రైతులు

● పాల వ్యాపారస్తులు● వ్యవసాయ కూలీలు

● కూరగాయలు మరియు పండ్లు అమ్మే వ్యక్తులు

● వలస కార్మికులు

● ఇటుక బట్టి కార్మికులు

● మత్స్య కార్మికుడు మరియు మిల్లు కార్మికులు

● జంతు సంరక్షణ మరియు  అమ్మకపు దారులు

● బీడీ కార్మికులు మరియు చేనేత కార్మికులు

● లేబులింగ్ మరియు ప్యాకింగ్ కర్మాగారాల్లో పని చేసే కార్మికులు

● పెయింటింగ్ కార్మికులు మరియు రంగు అద్దకపుదారులు

● కార్పెంటర్ వర్కర్స్

● ఉప్పు మరియు చర్మశుద్ధి కార్మికులు

● భవనం మరియు నిర్మాణ కార్మికులు

● మంత్రసానులు మరియు తోలు సుదికార్మికులం

● గృహ కార్మికులు మరియు మంగలి పనివారు మరియు చాకలి పనివారు

● న్యూస్ పేపర్ అమ్మే వ్యక్తులు మరియు ఆటో కార్మికులు మరియు రిక్షా కార్మికులు

● ఆశా వర్కర్లు మరియు దుకాణదారులు మరియు మోటార్ వాహనాల కార్మికులు

●వస్తువులు/ సేవల/ అమ్మకపు నిమగ్నమైన10 మంది కంటే తక్కువ ఉన్న కార్మికులు ఈ పథకానికి అర్హులు

● వీధి కార్మికులు మరియు చిన్నచిన్న వర్తక వ్యాపార వస్తువులు

● ఇలా మరెన్నో చిన్న చిన్న వర్కర్స్ ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు


  E-SHRAM పథకానికి అనర్హులైన వారు లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనర్హులైన వారు:-

● గృహ ఆధారిత కార్మికులు లేదా స్వయం ఉపాధి పొందే కార్మికులు లేదా ఏదైనా వేతనాన్ని పొందుతున్న కార్మికులు

● జాబ్ చేస్తూ ESIC లేదా EPFO సభ్యులు ఈ పథకానికి అనర్హులు

● అంతేకాకుండా ఏదైనా వ్యాపారాలు చేస్తూ గవర్నమెంట్ కి GST కడుతున్న వ్యక్తులు ఈ పథకానికి అనర్హులు

● స్వయం ఉపాధి పొందే కార్మికులు మరియు వాటి అనుబంధ సంస్థలు ఈ పథకానికి  అనర్హులు

● అతను ఆదాయపు పన్ను చెల్లింపుదారు కాకూడదు


ఈ - శ్రామ్ కార్డు ప్రయోజనాలు 

                             ప్రస్తుతం ఈ ESHRAM ద్వారా రిజిస్ట్రేషన్ మాత్రమే జరుగుతుంది కార్మికుల నమోదు ప్రక్రియ ప్రమాద బీమా సౌకర్యం సంవత్సరానికి 2లక్షలు. జాతీయ సంక్షోభం వంటి పరిస్థితులలో అర్హత ఉన్న కార్మికులకు ఈ డేటా ఆధారంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అంతేకాకుండా ESHRAM వెబ్సైట్లో నమోదు చేసుకున్న కార్మికులకు,PMSBY పథకం కింద నమోదు చేయబడతారు. మరియు మొదటి సంవత్సరం ప్రీమియం భారత ప్రభుత్వం యొక్క కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. అసంఘటిత కార్మికుడు ESHRAM వెబ్సైట్లో వారి డీటెయిల్స్ ఎంటర్ చేసి కార్డు పొందడం ద్వారా లేదా వారి సమీపంలోని CSC  సందర్శించడం ద్వారా తమను తాము నమోదు చేసుకోవచ్చు .అంతేకాకుండా వారు తమ సంబంధిత బ్యాంకులు కూడా సందర్శించవచ్చు.అత్యవసర మరియు జాతీయ మహమ్మారి వంటి పరిస్థితుల్లో అర్హులైన కార్మికులకు అవసరమైన ఆర్థిక సహాయాన్నిఅందించడానికి భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. ఆర్థిక సహాయం కార్మికుల బ్యాంకు అకౌంట్ లో వేయడం జరుగుతుంది

         


            ESHRAM పథకానికి అప్లై చేసుకోవడానికి అవసరమైన పత్రాలు:-

1) ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు గల అర్హులైన ప్రతి ఒక్కరికి భారత ప్రభుత్వం ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తుంది

2) ఆధార్ కార్డు నెంబర్

3) ఆధార్ కార్డు కి లింక్ చేయబడిన మొబైల్ నెంబర్

4) బ్యాంకు ఖాతా నెంబర్

5) ఒక కార్మికుడికి ఆధార్ లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ లేకపోతే వారు వారిని సమీపంలోని CSC లను సందర్శించి బయోమెట్రిక్ ప్రామాణీకరణ ద్వారా నమోదు చేసుకోవచ్చు

6) ESHRAM పోర్టల్లో నమోదు ఉచితం. కార్మికులు రిజిస్ట్రేషన్ సంతకం ఎటువంటి చార్జీలు చెల్లించనవసరం లేదు పూర్తిగా ఉచితం

7) దీని ద్వారా కార్మికుడికి ఎటువంటి అవాంతరాలు లేకుండా ఆర్థిక సహాయాన్ని తన యొక్క బ్యాంక్ అకౌంట్ లో మొత్తాన్ని జమ చేయడం జరుగుతుంది

Conclusion:-  ఇందులో ఈ శ్రామ్ కార్డ్ డీటెయిల్స్ మరియు ఎలా అప్లై చేయాలి ఇందులో చెప్పడం జరిగింది మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా  Comment Box లో  కామెంట్ చేయండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు