మీ మొబైల్ ఫోన్ లోనే మీ భూమి కి ఆధార్ కార్డు లింక్ అయ్యిందా లేదా తెలుసుకోవచ్చు అలా తెలుసుకోవాలి అంటే ఈ క్రింద చూపిన విధంగా మీరు ఫాలో అవ్వండి.
మీ భూమి కి ఆధార్ కార్డు ని ఇలా లింక్ చేయాలి
దీని ద్వారా మీ పొలం పాస్ బుక్ కి ఆధార్ కార్డు లింక్ అయ్యిందా లేదా తెలుసుకోవచ్చు.
మీ పాస్ బుక్ కి ఆధార్ కార్డు లింక్ అయితేనే గవర్నమెంట్ ఇచ్చే పథకాలు, మీకు వస్తాయి, అదే ఆధార్ కార్డు లింక్ కాకపోతే గవర్నమెంట్ ఇచ్చే పథకాలు మీకు రావు
1) మొదట మీరు meeboomi website మీ మొబైల్ ఫోన్ లో ఓపెన్ చేయాలి, లేదా ఈ క్రింద ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి.
2) meeboomi web site ఓపెన్ అయిన వెంటనే
అందులో ఆధార్ ఇతర గుర్తింపు పత్రాలు option మీద క్లిక్ చేయాలి
● ఆధార్ లింకింగ్
● మొబైల్ నంబర్ లింకింగ్ గుర్తింపు పత్రములు ఆధారంగా
● ఆధార్ రిక్వెస్ట్ స్టేటస
ఇందులో మీరు ఆధార్ లింకింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
2) వెంటనే ఆధార్ లింకింగ్ సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది, దీని ద్వారా నీ ఖాతా నెంబర్ కి ఆధార్ లింక్ అయ్యిందా లేదా తెలుసుకోవచ్చు.
● ఖాతా నెంబరు ● ఆధార్ నెంబరు
ఈ రెండింటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, వెంటనే
● జిల్లా పేరు ● మండలం పేరు ● గ్రామం పేరు ● ఆధార్ నెంబరు లేక ఖాతా నెంబరు ఎంటర్ చేయాలి,
పైన కనిపిస్తున్న Code నీ కింద ఉన్న బాక్స్ లో ఎంటర్ చేయాలి, పక్కన ఉన్న బాక్స్ లో రైట్ క్లిక్ ఇచ్చి,
సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి,
3) వెంటనే ఆధార్ లింకింగ్ కి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది, అందులో మీకు తెలుస్తుంది మీ యొక్క పాస్ బుక్ కి ఆధార్ కార్డు లింక్ అయ్యిందా లేదా
● ఖాతా సంఖ్య ● పట్టాదారుని పేరు ● తండ్రి పేరు ● ఆధార్ కార్డు లింకింగ్ స్థితి
ఆధార్ కార్డు లింక్ ఈ స్థితిని మీరు పరిశీలించినట్లయితే మీ పాస్ బుక్ ఆధార్ కార్డు లింక్ అయ్యిందని లేదా ఆధార్ కార్డు లింక్ కాలేదు అని మీకు చూపిస్తుంది.
4) ఒకవేళ ఇందులో ఆధార్ కార్డు లింక్ కాలేదు అని చూపిస్తే మీరు మీ సేవ కి వెళ్లి మీ పాస్ బుక్ కి ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే మీరు గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కి అర్హులు
0 కామెంట్‌లు