28 states కి సంబంధించిన ఉపాధి హామీ డబ్బులు మీ అకౌంట్లో పడుతున్నాయో లేదా ఇలా చెక్ చేసుకోండి
ఈ List లో మీకు కనిపించే ముఖ్యమైన సమాచారం:-
మీ జాబ్ కార్డు తెలియకపోతే నీ జాబ్ కార్డ్ నెంబర్ కూడా తెలుసుకోవచ్చు అలానే నీకు ఏ బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ పడుతుందో కూడా తెలుసుకోవచ్చు, దానితోపాటు మీ కుటుంబంలో ఎంతమంది ఉపాధి హామీ పథకానికి అప్లై చేశారో కూడా తెలుసుకోవచ్చు, మీ కుటుంబంలో ఎవరెవరు ఉపాధి హామీ పథకానికి అప్లై చేశారు వారి పేర్లతో సహా తెలుసుకోవచ్చు మరియు వాళ్ల AGE , Male or female మరియు వారి అడ్రస్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు, అలానే ఎప్పుడు అమౌంట్ ఎంత అకౌంట్ లో పడిందో కూడా తెలుసుకోవచ్చు, ఇలాంటి మరెన్నో విషయాలు ఈ web site లో తెలుసుకోవచ్చు,
1) మొదట మీ గూగుల్ క్రోమ్ open చేసి ఈ క్రింద ఉన్న లింక్ ని search చేయండి, లేదా ఈ క్రింద లింక్ మీద క్లిక్ చేయండి,
2) ఉపాధి హామీ మెయిన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, దాని కింద కి చూసినట్లయితే అందులో job card అని ఉంటుంది, దానిమీద క్లిక్ చేయండి ,
3) ఇప్పుడు మీకు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన Total లిస్ట్ open అవుతుంది. అందులో మీది ఏ రాష్ట్రము సెలెక్ట్ చేసుకొని ఆ రాష్ట్రం మీద క్లిక్ చేయాలి
4) ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన రాష్ట్రానికి సంబంధించిన మరొక పేజీ Open అవుతుంది. అందులో ఈ క్రింద చెప్పిన విధంగా డీటెయిల్స్ ఇవ్వాలి
Financial year:- మీరు ఏ సంవత్సరానికి సంబంధించిన అమౌంట్ ని తెలుసుకోవాలి అనుకుంటున్నారు ఆ సంవత్సరాన్ని అక్కడ సెలెక్ట్ చేయాలి
District:- మీ డిస్టిక్ ని సెలెక్ట్ చేసుకోండి.
Block:- మీది ఏ మండలం అయితే ఆ మండల ని సెలెక్ట్ చేయాలి
Panchayat:- మీ ఊరి పేరు సెలెక్ట్ చేసుకోవాలి
మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ గాని ఇస్తే proceed మీద క్లిక్ చేయాలి,
5) ఇక్కడ మీ ఊరికి సంబంధించి లేదా మీ పంచాయతీకి సంబంధించి ఎంతమంది అయితే జాబ్ కార్డు అప్లై చేశారు వాళ్ళ Total లిస్టు మొత్తం రావడం జరుగుతుంది.
Job card:- ఇక్కడ మీ జాబ్ కార్డ్ నంబర్ అనేది ఉండటం జరుగుతుంది
Name:- ఇక్కడ ఆ ఊరికి సంబంధించిన జాబ్ కార్డ్ అప్లై చేసిన వాళ్ల పేర్లు ఉండటం జరుగుతుంది
ఈ లిస్టులో మీ పేరు వెతుక్కొని దానికి ఎదురుగా ఉన్న జాబ్ కార్డు నెంబర్ మీద క్లిక్ చేయాలి అప్పుడు మీ కుటుంబానికి సంబంధించిన Total payment List అనేది open అవుతుంది
6) మీ కుటుంబానికి సంబంధించిన డీటెయిల్స్ ఓపెన్ అయిన వెంటనే అందులో మీరు చూసినట్లయితే
A} నీ జాబ్ కార్డు నెంబరు B} నీ పేరు C} మీ నాన్న లేదా భర్త పేరు D} మీ Cast పేరు
E} ఉపాధి హామీ కి రిజిస్ట్రేషన్ చేసుకున్న Date F} మీ జిల్లా G} మీ మండలం H} మీ ఊరి పేరు
I} ఉపాధి హామీ అమౌంట్ పడుతున్న బ్యాంకు పేరు
J} నీ కుటుంబం లో ఎవరి పేరు మీద ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఆ బ్యాంకు పేరు చూడవచ్చు.
6} అలానే కింద ఉన్న List చూసినట్లయితే ,ఏ సంవత్సరంలో ఎంత అమౌంటు మీ బ్యాంక్ అకౌంట్ లో పడిందో తెలుసుకోవచ్చు
0 కామెంట్‌లు